Wednesday, April 17, 2013

"ఆకలి" రాజ్యం....!!

"ఆకలి" రాజ్యం....!!
******************

ప్రతి సూర్యోదయంలో మరణిస్తాం
చంద్రోదయంతో పునర్జన్మిస్తాం
కామ పిశాచాలకై ఎదురుచూస్తాం
సొగసు కావ్యాలను అమ్ముకుంటాం

వెలివేయబడ్డ దేవతలం మేము
కామాంధులు ఆరాధించే దైవాలము మేము
చేయడానికి వేరే పని దొరకలేదా?
అని ప్రశ్నించే నోళ్ళను చుంబించే మూతులు మావి

జాతి, కులం, భాష, ప్రాంతం
తారతమ్యం లేని నిండు మనసులు మావి
మోసాలకు బలి అయిన బ్రతుకులు మావి
మాసాల కడుపుతో కడుపు నింపుకునే జీవనం మాది

వయసులో నిండు విస్తరి
తరువాత ఎండిన పందిరి
మాకూ ఒక మనసుంది
అది గుర్తిస్తే చాలు మరి..

అదిగదిగో సూర్యుడు అస్తమిస్తున్నాడు
మా ఆకలి పట్టించుకోని
మనుషుల "ఆకలి" తీర్చే వేళైంది
ఇక సెలవా మరి?

-సంజయ్ గాంధీ....!!

No comments: