Thursday, November 19, 2009

నేటి మహిళ

ఉసోదయంలా వెలుగుతున్న
నిశి రాత్రిలో నలిగి పోతోంది
గగనపు అంచులు చిలుచుకు వస్తున్నా
పాతాళంలోకి కూరుకు పోతోంది

అరణ్యాల వడిలో నిదురిస్తోంది
ఉద్యమాల బాటలో పయనిస్తోంది
జనారణ్యంలో విహరిస్తోంది
తన హక్కుల కోసం పోరాడుతోంది
సృజన్తమకత పెంచుతోంది
శికరాల అంచులు చుంబిస్తోంది
పోటా పోటిగా పోటి పడుతూ

ఎదురు దెబ్బలు తగులుతున్న తోనికిసలడక
తడబడ్డ తప్పటడుగు వేయక
తన లక్ష్య సాధన కై సాగుతోంది

అవమానం , అభిమానం
దిక్కారం , అధికారం
సమ పాలుగా చేసుకొని సాగుతోంది..............

పల్లె సీమ అవుతోంది అనాధ

మేఘం కరగదు
మా కన్నీరు ఆగాదు
పని దొరకదు
దొరికినా కడుపు నిండదు
ఆకలి తీరదు
చావు దరికి రాదు
దేవుడికి మాఫై జాలి లేదు
పల్లెనోదలాలంటే అడుగురాదు
మేము ఎమైన పర్వాలేదు
కానీ ! పిల్లలకు ఏమి కారాదు

ఇది ఎందరో పల్లె జీవుల గాధ
అందుకే పల్లె సీమ అవుతోంది అనాధ