Wednesday, February 25, 2009

ఓ బాల కార్మికుడు

ఎన్ని వేల మరణాలో అనుక్షణం లోలో
అన్ని వేల జననాలు మరుక్షణం నాలో
కలతల కలవరం ఒక వైపు
నవ్వుల పరిమళం ఒక వైపు
బాధల చుంబనం ఒక వైపు
బరువులు దించడం ఒక వైపు
పలక బలపం ఒక వైపు
పార పరక ఒక వైపు
నాన్నలు పరువై మీ బరువులు మోస్తున్నారు
బరువులు పరువై మా నాన్నను మోస్తున్నాను

అందుకే !
ఎన్ని వేల మరణాలో అనుక్షణం లోలో
అన్ని వేల జననాలు మరుక్షణం నాలో ................ ఓ బాల కార్మికుడు

Tuesday, February 24, 2009

కాల్ సెంటర్

కాల్ సెంటర్ జాబు కోసం
కాబ్ ఎక్కి పోతుంటే
నిశి రాత్రి నవ్వింది
షిఫ్ట్ అయ్యాక ఇంటికి వెళ్లి
పడుకోబోతుంటే సూరీడు నవ్వాడు,

పగలు రే ఐనద రేయి పగలు ఐనదా అని నన్ను చూసి !

ఎగ్జామ్స్ టైం లో రాత్రి చదువుతుంటే
వెన్నెల తోడు నిలిచింది
ఎగ్జామ్స్ ఐయక ఆదమరిచి నిదరోతుంటే
వేకువ జోల పడింది

విద్య నేర్చుకునేటప్పుడు లేని అబ్యంతరం

అది ప్రదర్శించేటప్పుడు ఎందుకో

రగులుతున్న రగులుతున్న

రగులుతున్న రగులుతున్న
రగులుతూనే పగులుతున్న
పోగల సెగలను కక్కుతున్న
రగులుతున్న రగులుతున్న
రగులుతూనే పగులుతున్న

వెలుగు నింపే దీపమల్లె
దహన కాండకు రూపమల్లె
జ్వలించేటి శక్తి వున్నా
నాకు నేనే జ్వలిస్తున్న

ఆసురులేల్లరు మంటగలువగ
శ్వాస శ్వాస అజ్యమాయే
వేదనే వేదమాయే
నిప్పు రవ్వలు చిన్నవేర
ఎగసి ఎగసి జ్వలలాయే
జలములేవి అర్పలేక
బుడిదల్లె మేగులుతున్న


రగులుతున్న రగులుతున్న
రగులుతూనే పగులుతున్న

Thursday, February 19, 2009

తరం తరం నిరంతరం

తరం తరం నిరంతరం
ప్రవాహ మల్లె సాగుతున్న
సంపదంటి సంస్కృతిని మరిచేలా చేస్తోంది

క్షణం క్షణం అనుక్షణం
చాప కింద నీరు లాగా
సిరి పంటలో కలుపు మొక్కలా పెరుగుతోంది

ఆత్మీయత , అనుబధం అన్ని ఈ రోజేనా(వెలంటైన్స్ డే)
ప్రేమ , పశాలన్ని పెర్యురలేనా

ఈ తరం యువతరం మారాలి .....నవతరం కావాలి


అవగాహన పెరగాలి
ఆలోచన మరలి



మన దారి మనమే ఎంచు కోవాలి

వందనం ప్రియ

మరపు రాని మైమరపు నీవు
అర్థం కాని అంతరాత్మవు నీవు
ఎదురు చూపులకు అర్థం తెలిపావు
నా మనసు భాషకు పదం కలిపావు
ఆయువు ఆశల వుయాల నీవు
ఆరని కోరిక దీపం నీవు
ఎంత కాలం ఈ వింతదూరం
ఎంత దూరం నా మనసు తీరం
ఊహగా మిగులుతున్న సత్యం నీవు
స్వప్నం లో సఖ్యత పంచినందుకు నీకు వందనం ప్రియ

నిశ్శబ్ధం కావాలి

నిశబ్దపు నిశబ్ద నిశ్శబ్ధం నుంచి
ఓంకారం జన్మించింది
ఒంకారపు అనంత కోటి ఒంకారాల నుంచి
సంగీతం జన్మించింది
అలాగే ........ స్వరాలు
రాగాలు
భావాలు
భాషలు
కూతలు, కేకలు, గానాలు
ఆనందం, ఆవేశం
ఆక్రోశం , ఆవేదన
మళ్ళి నిశ్శబ్ధం ...........

సంతోషం ఎక్కువిన వేల మాటలు రాక నిశ్శబ్ధం
మనసు ఆదామరిచి నిద్రుస్తున్న వేల నిశ్శబ్ధం
ఆవేదన ఎక్కువై దుఃఖం లో నిశ్శబ్ధం

అందుకే నిశబ్దపు , నిశబ్ద నిశ్శబ్ధం కావలి
నిషేదించినా నిద్రించని
జాగ్రుత నిశ్శబ్ధం కావాలి