Monday, January 28, 2008

చుక్కలు లేని నడి రేయి చినుకుల వోచ్చావు...

చుక్కలు లేని నడి రేయి చినుకుల వోచ్చావు...
మసకలో, మనసులో జల్లు మనిపించావు ...
కలలు లేని నిదురను మేలుకోలిపావు ...
నీ ధ్యాసలో కనులను మూయక నిలిపావు ...
నిజమైన హాయినీ నాకు పంచావు ....
అందుకే ...
తడికానీ నైవేధాలు
జన్మాంతం నీకేయ్ నా ప్రియా..
Chukkalu leni naDi rayi chinukkaley vacchavu
Masakklo, Manssulo jallu manipincheyvu
Kalaluleni nidduranu melukolipeyvu
Nee dhyasalo kannulu muyaka nelipevu
Nijamina ee hayi naaku panchavu
Andhukey
Tadikani nivedyalu
Janmantham nekey naa priya……..

నువ్వు నాలో వున్నావు కనుక

రాత్రి కోసం వేచి ఉన్న
ఉదాయ రాగం పలకాలంటు.

మెరుపుల కోసం వేచి ఉన్న
నెమలిలా ఆడాలంటు

వరద కోసం వేచి ఉన్న ,,
చేపలా ఎదు రిదలంటూ

మేఘం కోసం వేచి ఉన్న
వర్షంలా కురవాలంటు

వసంతం కోసం వేచి ఉన్న
కోయిలలా పాడాలంటూ

నీ కోసం వేచి ఉన్న
నా మనసు నీలోనే కరగాలని


వేధానల వస్తావా
వేధంలా వస్తావా
గాయంలా వస్తావా
గానంలా వస్తావా
క్రోధంలా వస్తావా
మొధంలా వస్తావా
ఉరిలా వస్తావా
సిరీలా వస్తావా
శిలలా వస్తావా
శిల్పంలా వస్తావా
నువు ఎలా వచ్చిన స్వికరిస్త
ఎందుకంటే
నువు నాలోనే వున్నావు కనుక....


అమృతవర్షిణి

వెళ లేనిది కానిది అమ్మ ఒక్కటే
తరాలెన్ని మారిన గుణం ఒక్కటే
కళలు నేర్వని కళాకారిణి
భాష రాణి భావవర్ధిని
ఇంటిల్లిపాదిని సముదాయించు అవధాని
పాపకు చనుబాలు
భర్తకు మురిపాలు
సమపాలుగా పంచే అమృతవర్షిణి

తల్లి తల్లి తెలుగమ్మ

తల్లి తల్లి తెలుగమ్మ
నిను మరిచాము మము మన్నించు
పరా బాష పారాయణమున పరవశించి
నిను మరిచాము మము మన్నించు

తల్లి పాల రుచి తెలుగని తెలుసు
కోయిల పాటలు తెలుగని తెలుసు
పసి పాపల నవ్వులు తెలుగని తెలుసు
పల్లె సొగసులు తెలుగని తెలుసు
ఐన ఐన మరిచాము
మేమ్ మేమ్ ఐన ఐన మరిచాము

ఈ తప్పులు మలిసారి జరగక
మా తప్పులు మలిసారి జరగక
తెలుగును తెలుగుగ పలికెదము
తెలుగు వెలుగులను చాటెదాము
నీ గార్బసోకమును బాపెదము

talli talli telugamma
ninu marichamu mamu manninchu
para basha parayanamuna paravasinchi
ninu marichamu mamu manninchu

talli paala ruchi telugani telusu
koyila paatalu telugani telusu
pasi paapala navvulu telugani telusu
palle sogasulu telugani telusu
ina ina marichamu
mem mem aina aina marichamu

ee tappulu malisaari jaragaka
maa tappulu malisari jaragaka
telugunu teluguga palikedamu
telugu velugulanu chatedamu
nee garbasokamunu bapedamu